తెలుగులో విడుదలైన హిందీ కాంట్రవర్సీల సినిమా

Messenger-of-God
‘ది మెసంజర్ ఆఫ్ గాడ్’ సినిమా ఎన్నో కాంట్రవర్సీలను ఎదుర్కుని ఎట్టకేలకు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ధీర సచ్ఛ సౌధ అనే మనోవిజ్ఞానవికాస సంస్థకి అధిపతి అయిన గుర్మీత్ రామ్ రహీమ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం ట్రైలర్ విడుదలైన నాటినుండే లెక్కలేనన్ని ఆరోపణలు ఎదుర్కుంది. వాటిని అధిగమిస్తూ ఎ సినిమా హిందీలోనే కాక తెలుగు, తమిళ మరియు మళయాళ భాషలలో విడుదలకానుంది.

సెన్సార్ సభ్యులు ఈ సినిమాను విడుదలకు ఆమోదించకుండా నిలిపివేయడంతో ఈ సినిమా వార్తలలో నిలిచింది. ఈ సినిమా CBFC చీఫ్ లీలా సామ్సన్ రాజీనామాకి సైతం కారణమయ్యింది. ఎన్నో సిక్కు సంస్థలు ఈ చిత్రాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నించడమేకాక ఈ సినిమాను నిషేదించాలని కోరారు.

Exit mobile version