విజయ్ దేవరకొండకు పెద్ద చిక్కే వచ్చిపడింది.

Published on Apr 5, 2020 12:00 am IST

టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండకు పెద్ద చిక్కొచ్చిపడిందట. ఆయన జిమ్ చేసుకోవడానికి సౌకర్యాలు లేక ఇబ్బంది పడుతున్నాడట. విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఫైటింగ్ బేస్డ్ స్టోరీలో నటిస్తున్నాడు. విజయ్ ప్రొఫెషనల్ ఫైటర్ గా కనిపించనున్నాడు ఈ చిత్రంలో. ఈ చిత్రం కోసం విదేశాలలో విజయ్ ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. తెలుగుతో పాటు హిందీ మరియు తమిళ భాషలలో ఈ చిత్రం విడుదల కానుంది.

ఐతే ఈ చిత్రంలోని ఫైటర్ లుక్ కోసం విజయ్ బాడీ మేకోవర్ చేయాల్సి ఉండగా కరోనా కర్ఫ్యూ కారణంగా అన్ని వ్యాయామశాలలు బంద్ చేయడం జరిగింది. ఇంటిలో సరిపడా జిమ్ ఎక్విప్ మెంట్ లేకపోవడంతో పాటు నిపుణుల పర్యవేక్షణ లేక విజయ్ ఇబ్బందిపడుతున్నాడంట. ఈ లాక్ డౌన్ ఇంకా చాల రోజులు కొనసాగేలా ఉన్న నేపథ్యంలో ఆయనకు ఏమి చేయాలో పాలుపోవడం లేదని తెలుస్తుంది. ఇక పూరి కనెక్ట్స్ మరియు ధర్మ ప్రొడక్షన్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తుంది. ఈ చిత్రానికి సంగీతం మణిశర్మ అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More