మళ్ళీ పరిస్థితి మొదటికి వచ్చింది !

మళ్ళీ పరిస్థితి మొదటికి వచ్చింది !

Published on Apr 18, 2021 4:00 AM IST

ప్రస్తుతం సినిమా పరిశ్రమకి ఇప్పుడు కరోనా సెకెండ్ వేవ్ భయం పట్టుకుంది. గతేడాది కన్నా ప్రస్తుతం ఎక్కువగా కోవిడ్ స్ప్రెడ్ అవ్వడం అసలు రోజురోజుకూ సినిమాల పరిస్థితి మరీ ఘోరంగా తయారవుతుంది. ఇప్పటికే ఒక్కొక్కటిగా తమ సినిమా రిలీజ్ డేట్ ను వాయిదా వేసుకుంటున్నారు నిర్మాతలు. ఈ నెలలో విడుదల కావాల్సిన ‘లవ్ స్టోరీ’, ‘తలైవి’ చిత్రాలు ఇప్పటికే వాయిదా పడ్డాయని అధికారిక ప్రకటన వచ్చింది. అలాగే వచ్చే నెలలో విడుదల కావాల్సిన ‘ఆచార్య’, బాలకృష్ణ మూవీ కూడా ఇప్పుడు రిలీజ్ అయ్యే స్థితిలో లేవు.

అన్ని సినిమాల రిలీజ్ డేట్లు తారుమారు అవుతున్నాయి. పైగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయని వచ్చే వారం నుంచి అసలు థియేటర్లనే మూసివేయాలని తెలంగాణ ప్రభుత్వం యోచిస్తోందన్న చర్చ జరుగుతుంది. అలాగే థియేటర్ల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అదే వ్యూహాన్ని అమలు పరుస్తోందని అంటున్నారు. మొత్తానికి మళ్ళీ సినిమా ఇండస్ట్రీ పరిస్థితి మొదటికి వచ్చింది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు