ఆర్ ఆర్ ఆర్ నిర్మాతకు ఆ టెన్షన్ ఎక్కువైంది.

ఆర్ ఆర్ ఆర్ నిర్మాతకు ఆ టెన్షన్ ఎక్కువైంది.

Published on Mar 24, 2020 9:41 AM IST

చిత్ర పరిశ్రమలో నిర్మాతకు ఉండే కష్టాలు అన్నీ ఇన్నీ కావు. సినిమా నిర్మాణం ఒక ఎత్తైతే దానిని విడుదల చేయడం మరో ఎత్తు. ఇక సినిమా అనుకున్న సమయంలో పూర్తి కాకపోతే బడ్జెట్ పెరిగిపోతుంది.కాలం గడిచే కొద్దీ సినిమా ఫైనాన్సర్స్ కి వడ్డీల రూపంలో అధిక మొత్తం చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందుకే ఏ నిర్మాత అయినా సినిమాను అనుకున్న సమయానికి విడుదల చేయాలని అనుకుంటారు.

ఇక ఆర్ ఆర్ ఆర్ నిర్మాత దానయ్యను కూడా ఇదే భయం వెంటాడుతోందట. ఇప్పటికే అనేక అవాంతరాల కారణంగా ఆర్ ఆర్ ఆర్ విడుదల జులై 2020 నుండి జనవరి 2021కి మారింది. ఈ సారైనా వాయిదా లేకుండా రావాలని రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకుంటే కరోనా రూపంలో మరో అవరోధం వచ్చి చేరింది. సాధారణ పరిస్థితులు ఏర్పడి షూటింగ్ వెంటనే మొదలవుతుందన్న దాఖలాలు కనిపించడం లేదు. కరోనా ప్రభావం అంతకంతకు పెరిగిపోవడమే దీనికి కారణం. దీనితో ఆర్ ఆర్ ఆర్ నిర్మాత దానయ్య టెన్షన్ పడుతున్నారని వినికిడి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు