నితిన్ పెళ్ళికి కరోనా కష్టాలు..!

Published on Mar 16, 2020 10:08 am IST

నితిన్ థర్టీ ప్లస్ దాటివేసి చాలా కాలం అవుతుంది. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కుదామని సర్వం సిద్దమైన వేళ కరోనా రూపంలో ఆయన పెళ్ళికి అడ్డంకి వచ్చి చేరింది. నితిన్ కొద్దిరోజుల క్రితం తన చిరకాల ప్రేయసి శాలినితో నిశితార్థం చేసుకున్నారు. వీరి వివాహం ఏప్రిల్ 16న దుబాయ్ లో గ్రాండ్ గా జరగాల్సివుంది. దుబాయ్ కూడా కరోనా ప్రభావిత దేశాలలో ఉండడంతో పాటు, వారు ఇతర దేశాల నుండి ప్రజల రాకపోకలపై ఆంక్షలు విధించారు. దీనితో నితిన్ మ్యారేజ్ సందిగ్ధంలో పడింది.

నితిన్ పెళ్లిపై కుటుంబ సభ్యులను వాకబు చేయగా అనుకున్న తేదీన పెళ్లి నిర్వహించేది, వాయిదా వేసేది ఇంకా నిర్ణయించలేదు అన్నారు. ఇక ఈ ఏడాది భీష్మతో మొదటి హిట్ అందుకున్న నితిన్ మరో మూడు చిత్రాలు వరుసలో పెట్టారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగ్ దే త్వరలో విడుదల కానుంది.

సంబంధిత సమాచారం :

More