స్టార్ హీరో ఇంట్లో క‌రోనా నిర్ధార‌ణా ప‌రీక్షలు !

Published on Mar 31, 2020 3:02 pm IST

క‌రోనా మ‌హ‌మ్మారి రోజు రోజుకి విజృభిస్తుంది. ఈ భ‌యంక‌ర‌మైన వ్యాధి నివార‌ణ‌కు ప్ర‌భుత్వం వివిధ ర‌కాల చ‌ర్య‌లు తీసుకుంటున్న సంగ‌తి తెలిసిందే.అందులో భాగంగా తమిళ్ స్టార్ విజ‌య్ నివాసంలో ఆరోగ్య శాఖాధికారులు కరోనా ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. విదేశాల‌కు వెళ్లి వ‌చ్చిన వారి లిస్ట్ ను రెడీ చేసుకున్న త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం.. ఆ లిస్ట్ ప్రకారం అందరికీ కరోనా ప‌రీక్ష‌లు చేస్తున్నారు. అందులో భాగంగానే విజయ్ ఇంటికి వెళ్లి విజ‌య్ తో పాటు ఆయన కుటుంబ సభ్యుల‌కు కూడా క‌రోనా వైర‌స్ నిర్ధార‌ణా ప‌రీక్షలు చేశారు. అయితే ఎవ‌రికీ క‌రోనా వైర‌స్ సోక‌లేద‌ని స‌ద‌రు ఆరోగ్య‌శాఖా ప్ర‌తినిధులు స్పష్టం చేశారు. దాంతో విజయ్ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకున్నారు.

ఇక విజయ్ కొత్త సినిమా ‘మాస్టర్’ను మొదట ఏప్రిల్ 9న విడుదల చేయాలనుకున్నారు. కానీ, దేశవ్యాప్తంగా ప్రస్తుతం ప్రమాదకరమైన కరోనా వైరస్ ప్రభావం కారణంగా ఈ చిత్రం వాయిదా పడింది. ఈ చిత్రం విడుదలను మే నెలకు పోస్ట్ పోన్ చేయాలని విజయ్ అండ్ అతని టీమ్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఐతే ఈ వార్తకు సంబంధించి ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు. కాగా దర్శకుడు లోకేష్ కనకరాజ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో విజయ్ కాలేజ్ ప్రొఫెసర్ గా మాఫియా డాన్ గా భిన్న గెటప్స్ లో కనిపిస్తారట. ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు.

సంబంధిత సమాచారం :

X
More