‘లోఫర్’ ఫస్ట్ లుక్ కి కౌంట్ డౌన్ స్టార్ట్స్.!

‘లోఫర్’ ఫస్ట్ లుక్ కి కౌంట్ డౌన్ స్టార్ట్స్.!

Published on Nov 7, 2015 4:23 PM IST

lofer
దసరా కానుకగా రిలీజ్ అయిన ‘కంచె’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ప్రశంశలు అందుకుంటున్న మెగా హీరో వరుణ్ తేజ్. నటన పరంగా వరుణ్ కి చాలా మంచి పేరు తెచ్చి పెట్టిన కంచె సినిమా తర్వాత వరుణ్ తేజ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాద్ తో కలిసి చేసిన మాస్ ఎంటర్టైనర్ ‘లోఫర్’. ఇటీవలే ఈ సినిమాకి సంబందించిన షూటింగ్ మొత్తం పూర్తి చేసిన ఈ చిత్ర టీం ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయడానికి సిద్దమైంది. ఈ రోజు సాయంత్రం 7 గంటలకు పూరి జగన్నాధ్ సోషల్ మీడియాలో ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేయనున్నాడు.

అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి తరహాలో మదర్ సెంటిమెంట్ తో ఈ సినిమా వస్తుండడం వలన ఈ సినిమా లోఫర్ అనే టైటిల్ అంత పర్ఫెక్ట్ కాదేమో అని ఆ టైటిల్ ని మార్చాలని అనుకొనే ‘మా అమ్మ సీతామహాలక్షి’ అనే పేరును అనుకున్నారు. కానీ అధికారిక ప్రకటన లేదు. ఈ ఫస్ట్ లుక్ ద్వారా సినిమాకి లోఫర్ నే పేరే ఉంచారా లేక టైటిల్ మార్చారా అనేది తెలుస్తుంది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని శరవేగంగా పూర్తి చేస్తున్న ఈ చిత్ర టీం సినిమాని డిసెంబర్ 18న ఈ సినిమాని రిలీజ్ చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారు. అలాగే నవంబర్ చివరి వారం లేదా డిసెంబర్ మొదటి వారంలో ఆడియో రిలీజ్ చేయనున్నారు. వరుణ్ తేజ్ ఓ దొంగగా కనిపించే ఈ సినిమా ద్వారా దిశా పటాని హీరోయిన్ గా పరిచయం కానుంది. సి కళ్యాణ్ నిర్మాత.

తాజా వార్తలు