కరోనా సోకిన హీరోయిన్ ఏమందంటే..?

Published on Jul 2, 2020 11:15 am IST

బుల్లి తెర హీరోయిన్ నవ్య స్వామి కొద్దిరోజుల క్రితం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఓ సీరియల్ షూటింగ్ లో పాల్గొన్న ఆమెకు కరోనా సోకింది. దీనితో ఆమె ఐసొలేట్ కావడంతో పాటు చికిత్స తీసుకుంటున్నారు. కరోనా సోకిన ఈ నటి తన అనుభవాన్ని పంచుకున్నారు. అలాగే కొన్ని జాగ్రత్తలు చెప్పడంతో పాటు, తన గురించి ఆలోచించిన అభిమానులకు ధన్యవాదాలు తెలిపారు.

ఆమె మాట్లాడుతూ కరోనా సోకినంత మాత్రాన భయపడాల్సిన అవసరం లేదన్నారు. ధైర్యంగా ఉంటూ చికిత్స తీసుకుంటే దాని వలన జరిగే నష్టం ఏమీ లేదని ఆమె చెప్పారు. కరోనా సోకినా వెంటనే కొరెంటైన్ కావడంతో పాటు జాగ్రత్తలు పాటిస్తూ వైద్యం అందుకోండి అన్నారు. ముఖ్యంగా నిగెటివిటీకి దూరంగా ఉండండి అని ఓ వీడియో సందేశం పంపారు.

సంబంధిత సమాచారం :

More