“అఖండ”పై మరింత క్రేజీ ఇన్ఫో..!

Published on Jun 18, 2021 9:00 am IST

నందమూరి నటసింహం నందమూరి బాలకృష్ణ హీరోగా ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ చిత్రం “అఖండ” కోసం నందమూరి అభిమానులు సహా మాస్ ఆడియెన్స్ కూడా ఏ స్థాయిలో ఎదురు చూస్తున్నారో తెలిసిందే. బాలయ్య ఆస్థాన దర్శకుల్లో ఒకరైన బోయపాటి శ్రీనుతో తీస్తున్న హ్యాట్రిక్ చిత్రం కావడంతో దీనిపై ఎనలేని అంచనాలు ఉన్నాయి.

ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రంపై మరో క్రేజీ ఇన్ఫో ఈ చిత్రంలో నటిస్తున్న సీనియర్ హీరో శ్రీకాంత్ ద్వారా బయటకి వచ్చినట్టు తెలుస్తుంది. ఈ చిత్రంలో బాలయ్య చేస్తుంది కేవలం రెండు రోల్స్ మాత్రమే అని క్లారిటీ ఇవ్వడంతో పాటుగా అఘోరా పాత్ర అనేది జస్ట్ రోల్ లా కాకుండా చాలా ఉన్నతంగా ఉంటుందని తెలిపారు.

అలాగే ఈ చిత్రంలో బాలయ్య డైలాగ్స్ కి అయితే థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయమని కన్ఫర్మ్ చేశారు. దీనితో బాలయ్య అభిమానుల్లో మరింత అంచనాలు ఈ చిత్రంపై పెరిగిపోయాయి. మరి ఈ మోస్ట్ అవైటెడ్ సినిమా ఎప్పుడు వస్తుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా ద్వారకా క్రియేషన్స్ వారు నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :