“రాధే శ్యామ్” అంతా సెట్స్ మయం..వాటికే భారీ ఖర్చు.!

Published on Jun 22, 2021 6:00 pm IST

పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “రాధే శ్యామ్”. దర్శకుడు రాధా కృష్ణ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ఇంకొన్ని రోజుల్లో కంప్లీట్ కానుంది. అయితే ఈ భారీ పీరియాడిక్ పాన్ ఇండియన్ సినిమాపై లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ ఇన్ఫో బయటకి వచ్చింది. ఇది వరకే ఈ సినిమాలో భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో పాటుగా భారీ సెట్ వర్క్స్ కూడా ఉన్నాయని తెలిసింది.

మరి అలా ఈ చిత్రం 26 సెట్టింగ్స్ కనిపిస్తాయట. మరి అలాగే వాటి అన్నిటికి కూడా ఏ స్థాయిలో నిర్మాతలు ఖర్చు చేసారో అన్నది కూడా తెలుస్తుంది. కేవలం ఈ సెట్ వర్క్ కోసమే మేకర్స్ ఏకంగా 100 కోట్లకు పైగానే వెచ్చించారట. దీన్ని బట్టి ఈ బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఎంత గ్రాండ్ గా ఉండనుందో మనం అర్ధం చేసుకోవచ్చు. అలాగే మరో పక్క ఈ చిత్రం మోస్ట్ అవైటెడ్ ఫస్ట్ సింగిల్ పై కూడా లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది. మరి అదెప్పుడు వస్తుందో చూడాలి.

సంబంధిత సమాచారం :