టాలీవుడ్ రేంజ్ ని హాలీవుడ్ స్థాయికి చాటి చెప్పిన జక్కన్న రాజమౌళి కెరీర్ లో అన్ని కూడా పెద్ద సక్సెస్ఫుల్ సినిమాలే. జూనియర్ ఎన్టీఆర్ తో తీసిన స్టూడెంట్ నెంబర్ వన్ మొదలుకొని మొన్నటి ఆర్ఆర్ ఆర్ వరకు దర్శకుడిగా తన క్రేజ్ ని స్థాయిని విపరీతంగా పెంచుకుంటూ సాగుతున్న జక్కన్న రాజమౌళి అతి త్వరలో సూపర్ స్టార్ మహేష్ బాబుతో తన నెక్స్ట్ మూవీని చేయనున్నారు.
SSMB 29 వర్కింగ్ టైటిల్ తో రూపొందనున్న ఈ మూవీని దుర్గ ఆర్ట్స్ బ్యానర్ పై కేఎల్ నారాయణ నిర్మించనున్నారు. అయితే విషయం ఏమిటంటే, తాజాగా తన కుమారుడు కార్తికేయ నిర్మాతగా రాజమౌళి సమర్పణలో ఒక భారీ ప్రాజక్ట్ నిర్మితం కానుందని, అలానే ఈ క్రేజీ ప్రాజక్ట్ యొక్క అనౌన్స్ మెంట్ అప్ డేట్ రేపు రానుందని లేటెస్ట్ టాలీవుడ్ వర్గాల బజ్. కాగా ఈ ప్రాజక్ట్ గురించిన పూర్తి డీటెయిల్స్ రేపటి అప్ డేట్ లో వెల్లడి కానున్నట్లు తెలుస్తోంది.