‘రాకా’పై క్రేజీ బజ్.. షాకింగ్ బడ్జెట్, క్యామియోలు మరిన్ని విశేషాలివే!

raaka

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు అట్లీ కాంబినేషన్ లో చేస్తున్న పాన్ వరల్డ్ లెవెల్ చిత్రమే ‘రాకా’. మేకర్స్ అనౌన్సమెంట్ తో నెక్స్ట్ లెవెల్ హైప్ ని తీసుకొచ్చారు. ఇక అక్కడ నుంచి షూట్ మొదలు పెట్టుకున్న ఈ చిత్రం ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎదురు చూస్తున్నారు కానీ మేకర్స్ షూటింగ్ ని మాత్రమే అలా కొనసాగిస్తున్నారు.

అయితే రాకా సినిమా విషయంలో క్రేజీ విషయాలు ఇప్పుడు తెలుస్తున్నాయి. ఇండియా టుడే కథనాలు ప్రకారం. రాకా సినిమాని మేకర్స్ సింగిల్ పార్ట్ గా కాకుండా రెండు భాగాలుగా ఖాయం చేశారట. అలాగే రెండు భాగాలని కలిపి ఏకంగా 1000 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించాలని ప్లాన్ చేసినట్టు తెలుస్తుంది. ఇక రెండు భాగాల్లో కూడా ఇద్దరు హీరోయిన్స్ ప్రధానంగా కనిపిస్తారట.

దీపికా పదుకోణ్ ఓ సినిమాలో అల్లు అర్జున్ సరసన నటిస్తే మరో పార్ట్ లో మృణాల్ ఠాకూర్ కనిపించనుంది అని తెలుస్తుంది. అలానే దర్శకుడు అట్లీ ఒక పార్ట్ ని పూర్తిగా హిస్టారికల్ నేపథ్యంలో ఫాంటసీ ఎలిమెంట్స్ తో తెరకెక్కిస్తే మరో పార్ట్ పూర్తిగా భిన్నంగా ఫ్యూచరిస్టిక్ ప్రపంచంలో ఉంటుంది అని సమాచారం. వీటిలో హిస్టారికల్ భాగంలోనే దీపికా కనిపిస్తే, మరో భాగంలో మృణాల్ ఉంటుందట.

ఇక ఇవే కాకుండా మరో క్రేజీ బజ్ ఈ సినిమా విషయంలో వినిపిస్తుంది. దీని ప్రకారం బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ఈ సినిమాలో క్యామియో చేసే అవకాశం కూడా ఎక్కువే ఉందట. ఆల్రెడీ అట్లీతో షారుఖ్ చేసిన ‘జవాన్’ భారీ హిట్ అయ్యింది. సో షారుఖ్ కూడా క్యామియోలో కనిపించే అవకాశం ఉందని తెలుస్తుంది.

ఇక ఫైనల్ గా రిలీజ్ ప్లాన్ ల విషయానికి వస్తే.. మేకర్స్ రెండు భాగాల తాలూకా షూట్ ని ఒకేసారి పూర్తి చేసేయాలని ప్లాన్ చేసుకున్నట్టు తెలుస్తుంది. అందుకే ఎప్పుడో షూట్ మొదలు పెట్టినప్పటికీ పార్ట్ 1 కి బ్రేక్ ఇచ్చి పార్ట్ 2 షూట్ తర్వాత చేయాలని అనుకోకుండా రెండు భాగాల షూటింగ్ ఒకేసారి చేసేసి తక్కువ గ్యాప్ లో రెండు భాగాలని విడుదల చేసే సన్నాహాలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. సో రాకా ఫ్యాన్స్ కి ఇది సూపర్బ్ న్యూస్ అనే చెప్పొచ్చు.

Exit mobile version