ప్రస్తుతం నందమూరి నటసింహం బాలకృష్ణ ఫుల్ ఫామ్ లో ఉన్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే మన సీనియర్ హీరోస్ లో ది బెస్ట్ లైనప్ తో కూడా బాలయ్య డదూసుకెళ్తున్నారు. ఇలా ప్రస్తుతం బాలయ్య దర్శకుడు గోపీచంద్ మలినేని కాంబినేషన్లో సాలిడ్ ప్రాజెక్ట్ చేస్తున్నారు. ఆ తర్వాత పలువురు యువ దర్శకులు కూడా ఓకే అయ్యారు.
మరి ఇది పక్కన పెడితే లేటెస్ట్ గా ఓ క్రేజీ బజ్ వైరల్ గా మారింది. ఈసారి బాలయ్య, కొరటాల శివ కాంబినేషన్ పడనుంది అని తెలుస్తోంది. దాదాపుగా ఈ సెన్సేషనల్ కలయిక ఖరారే అన్నట్లు టాక్. మరి ఈ కాంబినేషన్ పై అధికారిక క్లారిటీ రావాల్సి ఉంది. ప్రస్తుతం కొరటాల దేవర 2 పనుల్లో బిజీగా ఉన్నారు. కానీ ఈ సినిమా మొదలు కావడానికి సమయం పడుతుంది. సో ఈ గ్యాప్ లో బాలయ్యతో సినిమా ఉంటుందా ఏమో అనేది వేచి చూడాల్సిందే.
