క్రేజీ బజ్..”కేజీయఫ్ 2″ ని కూడా ఇలా రిలీజ్ చేస్తున్నారా?

Published on Dec 17, 2021 8:00 am IST


ఇండియన్ సినిమా దగ్గర అంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న రెండు బిగ్గెస్ సినిమాల్లో టాలీవుడ్ నుంచి “RRR” ఒకటి కాగా కన్నడ నుంచి “కేజీయఫ్ చాప్టర్ 2” కూడా ఉంది. ఈ రెండు సినిమాలు కూడా ఒకదాన్ని మించి ఒకటి అంచనాలతో ఉన్నాయి. ఇక వీటిలో “రౌద్రం రణం రుధిరం” మొదటగా రిలీజ్ కానుంది. దీనితో అందరి అంచనాలు కూడా ఇక కేజీయఫ్ 2 వైపు షిఫ్ట్ అవుతున్నాయి.

అయితే దర్శకుడు ప్రశాంత్ నీల్ నెక్స్ట్ లెవెల్లో తెరకెక్కిస్తున్న బిగ్గెస్ట్ మాస్ థ్రిల్లర్ రిలీజ్ ప్రపంచ వ్యాప్తంగా వచ్చే ఏడాది ఏప్రిల్ 14న కన్ఫర్మ్ చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఈ రిలీజ్ పైనే క్రేజీ బజ్ వినిపిస్తుంది. ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా 3డి లో కూడా రిలీజ్ చేసే సన్నాహాలు ఉన్నాయట.

ఇప్పుడు ఆల్రెడీ భారీ సినిమా “RRR” 3డి రిలీజ్ ని కన్ఫర్మ్ చేసింది. ఇదే క్రమంలో కేజీయఫ్ చాప్టర్ 2 కూడా రానున్నట్టు సమాచారం. ఈ రెండు సినిమాలు కూడా ముందు 3డి లో అనౌన్స్ కాలేదు. ఇప్పుడు ఈ ప్లాన్ మంచిదే కానీ 3డి లో చూసి ఎంజాయ్ చేసే క్లోజ్ షాట్స్ కూడా ఉంటే ఇంకా థ్రిల్ చెయ్యడం గ్యారెంటీ.

సంబంధిత సమాచారం :