‘లైగర్’ కోసం మైక్ టైసన్.. నిజమెంత ?

Published on Jun 17, 2021 9:38 am IST

పూరి జగన్నాధ్ – విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో రూపొందుతున్న “లైగర్” సినిమా పై ఇప్పటికే అనేక రూమర్స్ వస్తూనే ఉన్నాయి, ఈ సినిమాలో కీలకమైన యాక్షన్ సీన్ లో రియల్ ఇంటర్ నేషనల్ బాక్సర్ నటించాలని అందుకే ప్రస్తుతం ఆ పాత్ర కోసం అమెరికన్ బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ను తీసుకున్నారని తెలుస్తోంది. మరి ఈ వార్తలో ఎంత వాస్తవం ఉంది అనేది అధికారిక ప్రకటన వచ్చే వరకూ ఆగాల్సిందే.

ఈ సినిమా కోసం విజయ్ దేవరకొండ తన లుక్ తో పాటు హెయిర్ స్టైల్ ను కూడా పూర్తిగా మార్చాడు. కాగా ఈ చిత్రాన్ని అన్ని దక్షిణ భాషలతో పాటు హిందీలో కూడా ఒకేసారి తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా కథలో పాన్ ఇండియా అప్పీల్ ఉందని భావించిన కరణ్ జోహార్ కూడా పూరి, ఛార్మిలతో కలిసి ఈ సినిమా నిర్మణంలో భాగస్వామి అయ్యాడు. ఇక విజయ్ దేవరకొండ చాల రోజులనుంచి బాలీవుడ్ సినిమా చేయాలని ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. మరి ఈ సినిమా విజయ్ దేవరకొండకు ఎలాంటి హిట్ ను ఇస్తోందో చూడాలి.

సంబంధిత సమాచారం :