తలా అజిత్ కుమార్ 63 మూవీ పై క్రేజీ బజ్

Published on Jan 28, 2023 2:06 am IST


కోలీవుడ్ స్టార్ యాక్టర్ తలా అజిత్ కుమార్ హీరోగా ఇటీవల తెరకెక్కిన మూవీ తునీవు. బోనీ కపూర్ తో కలిసి జీ స్టూడియోస్ వారు ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ మూవీ కి హెచ్ వినోద్ కుమార్ దర్శకత్వం వహించారు. తెలుగులో ఈ మూవీ తెగింపు టైటిల్ తో రిలీజ్ అయింది. ఇక రెండు భాషల్లో కూడా మంచి విజయం సొంతం చేసుకుంది ఈ మూవీ. అయితే దీని తరువాత అజిత్ నటించనున్న తదుపరి 62వ మూవీకి విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ యొక్క ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందట. దీని గురించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. అయితే దీని అనంతరం అజిత్ నటించనున్న 63వ మూవీ పై కొద్దిరోజులుగా మీడియా మాధ్యమాల్లో పలు కథనాలు ప్రచారం అవుతున్నాయి.

ఇక లేటెస్ట్ కోలీవుడ్ బజ్ ప్రకారం అజిత్ తన నెక్స్ట్ మూవీని యువ దర్శకుడు అట్లీ తో చేయనున్నారని, అలానే కోలీవుడ్ లో ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన లైకా ప్రొడక్షన్స్ వారు దీనిని అత్యంత భారీ వ్యయంతో నిర్మించనుండగా ఏఆర్ రహమాన్ సంగీతం అందించనున్నట్లు చెప్తున్నారు. మొత్తంగా ఈ క్రేజీ ప్రాజక్ట్ పై ఇంట్రెస్టింగ్ బజ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. అయితే ఈ ప్రతిష్టాత్మక మూవీ గురించిన డీటెయిల్స్ అధికారికంగా మాత్రం వెల్లడి కావాల్సి ఉంది.

సంబంధిత సమాచారం :