వరుసగా ఆఫర్లు అందుకుంటున్న క్రేజీ డైరెక్టర్ ?

వరుసగా ఆఫర్లు అందుకుంటున్న క్రేజీ డైరెక్టర్ ?

Published on Jul 17, 2018 12:37 AM IST

కార్తికేయ, పాయల్ రాజపుత్‌ లను హీరో హీరోయిన్లుగా పెట్టి “ఆర్ఎక్స్ 100” అనే బోల్డ్ సినిమాతో సంచలన విజయం సాధించాడు దర్శకుడు అజ‌య్ భూప‌తి. ఈ చిత్రం ఇప్పటికే బాక్స్ అఫీస్ వద్ద పది కోట్ల షేర్‌ను రాబట్టుకుంది. ఇంకా విజయవంతంగా నడుస్తోంది. దీంతో అజ‌య్ భూప‌తికి వరుసగా అవకాశాలు వస్తున్నాయి.

తాజాగా సినీవర్గాల సమాచారం ప్రకారం అజ‌య్ భూప‌తితో సినిమా చేయడానికి ప్రముఖ నిర్మాతలు ఇంట్రస్ట్ గా ఉన్నారని తెలుస్తోంది. ముఖ్యంగా స్రవంతి రవికిషోర్ హీరో రామ్ కి సరిపడ సబ్జెక్ట్ తో రావాలన అజయ్ భూపతికి ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే భవ్య క్రియేషన్స్ నుంచి, ప్రొడ్యూసర్ సుధాకర్ రెడ్డి నుంచి కూడా అజ‌య్ భూప‌తికి కాల్స్ వచ్చాయట. మరి వీటిల్లో ఈ దర్శకుడు ఏ ఆఫర్ ను చేదక్కించుకుంటాడో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు