ఆర్ఆర్ఆర్ మైండ్ బ్లోయింగ్ ప్రీ రిలీజ్ బిజినెస్

Published on Feb 9, 2020 10:38 am IST

గత రెండు రోజులుగా ఆర్ ఆర్ ఆర్ ప్రీ రిలీజ్ బిజినెస్ కి సంబంధించి, ఏరియాల వారీగా ఫిగర్స్ ప్రచారం అవుతున్నాయి. ఈ చిత్రం అన్ని ఏరియాలలో ఇండియాలోనే ఆల్ టైమ్ టాప్ బిజినెస్ చేసిన చిత్రంగా నిలిచిందంటూ ఆ లెక్కల సారాంశం. ఆర్ ఆర్ ఆర్ దేశంలోని అన్ని ప్రధాన భాషలతో కలిపి పది భాషలలో విడుదల చేయనున్నారని తెలుస్తున్న వస్తున్న నేపథ్యంలో ఒక్క తెలుగులోనే ఈ చిత్రం 270 నుండి 300కోట్ల బిజినెస్ చేసిందని ప్రచారం జరుగుతుంది.

నైజాం హక్కులు ఏకంగా 75కోట్లకు అమ్ముడు పోగా ఓవర్సీస్ హక్కులను మరో 75కోట్లకు అమ్మారట. ఇక కర్ణాటక విడుదల హక్కులను 50కోట్లకు ఒకరు దక్కించుకున్నారట. ఆంధ్రప్రదేశ్ లో కూడా గుంటూరు 20కోట్లు, నెల్లూరు 10కోట్లు పైగా ఈ చిత్ర థియరిటికల్ రైట్స్ అమ్ముడుబోయాయని సదరు వార్తల ద్వారా తెలుస్తుంది. మరి ఈ లెక్కలపై స్పష్టమైన సమాచారం లేకపోయినప్పటికీ, ఒక్క తెలుగులోనే ఇన్ని కోట్ల బిజినెస్ జరిగితే అన్ని భాషలలో కలిపి ఆర్ ఆర్ ఆర్ ఎన్ని వందల కోట్ల బిసినెస్ చేయనుంది అనే ఆసక్తి కలుగుతుంది.

సంబంధిత సమాచారం :