క్రేజీ హీరోతో టాలెంటడ్ డైరెక్టర్ !
Published on Sep 11, 2018 9:01 am IST

‘పెళ్లి చూపులు’ అంటూ తెలుగు తెర ఫై మెరిసి.. ‘అర్జున్ రెడ్డి’గా స్టార్ స్టేటస్ సంపాదించుకొని.. ‘గీతగోవిందం’తో స్టార్ హీరో అయిపోయాడు విజయ్ దేవరకొండ. ప్రస్తుతం విజయ్ ఫుల్ క్రేజ్ తో వరుస సినిమాలతో దూసుకెళ్తున్నాడు. దీనికి తోడు గీత గోవిందం సినిమాతో వంద కోట్ల హీరో అయిపోవడంతో స్టార్ డైరెక్టర్స్ కూడా ఇప్పుడు విజయ్ వెంట పడుతున్నారు.

తాజాగా మారుతి కూడా తన శైలజా రెడ్డి ప్రమోషన్స్ లో విజయ్ తో సినిమా చేయాలని ఉందని చెప్పిన విషయం తెలిసిందే. తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం దర్శకుడు మారుతి తన తర్వాత సినిమాని యూవీ క్రియేష‌న్స్‌లో చేయాల్సి ఉంది. ఇటు యూవీ వాళ్లు విజయ్ తో సినిమా చేయాలనుకుంటున్నారు. దాంతో విజయ్, మారుతి కాంబినేషన్ లో యూవీ క్రియేష‌న్స్‌ సినిమా సన్నాహాలు చేసుకుంటుంది. ఈ సినిమాకి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుందట. ప్ర‌స్తుతం మారుతి శైల‌జారెడ్డి అల్లుడు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా పై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక మారుతి కామెడీ టైమింగ్ కూడా చాలా బాగుంటుంది. ఆ కామెడీ టైమింగ్ కి, విజయ్ దేవరకొండ ఫెర్ఫామెన్స్ కూడా తోడైతే ఇక హిట్ గ్యారింటీ అని ఫిల్మ్ నగర్ టాక్.

  • 18
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook