క్రేజీ హారర్ థ్రిల్లర్ ‘డిమాంటి కాలనీ 3’ రిలీజ్ డేట్ వచ్చేసింది!

క్రేజీ హారర్ థ్రిల్లర్ ‘డిమాంటి కాలనీ 3’ రిలీజ్ డేట్ వచ్చేసింది!

Published on Jun 22, 2026 7:30 PM IST

మన దక్షిణాది సినిమా నుంచి వచ్చిన పలు ఇంట్రెస్టింగ్ హారర్ హిట్ చిత్రాలు అందులోని ఓ ఫ్రాంచైజ్ లో కోలీవుడ్ నుంచి కొన్ని కనిపిస్తాయి. అలాంటి చిత్రాల్లో కోలీవుడ్ దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు తెరకెక్కించిన ఈ ఇంట్రెస్టింగ్ థ్రిల్లర్ సినిమా ఫస్ట్ పార్ట్ ఆడియెన్స్ కి ఒక ఊహించని ట్రీట్ ఇచ్చింది. అలా గత కొన్నాళ్ల కితం వచ్చిన పార్ట్ 2 కూడా మంచి సక్సెస్ సాధించి 50 కోట్లకి పైగా కూడా రాబట్టింది.

ఇక ఈ సక్సెస్ తర్వాత పార్ట్ 3 ని కూడా వీరు అనౌన్స్ చేసి తెరకెక్కించారు. ఇప్పుడు దీనికి తాము రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసేసారు. ఈ సినిమా గ్రాండ్ గా ఈ సెప్టెంబర్ 11న థియేటర్స్ లో విడుదల చేస్తున్నట్టు ఖరారు చేసారు. సో ఈ ఫ్రాంచైజ్ లవర్స్ ఇది గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇక ఈ సినిమాలో దుర్గా రాం చౌదరి, మీనాక్షి తదితరులు కీలక పాత్రల్లో నటించారు. అలాగే సామ్ సి ఎస్ సంగీతం అందించారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు