క్రేజీ ఇన్ఫో : మరొక మూవీకి మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ?

క్రేజీ ఇన్ఫో : మరొక మూవీకి మెగాస్టార్ గ్రీన్ సిగ్నల్ ?

Published on Feb 1, 2024 2:02 AM IST

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మల్లిడి వశిష్ట దర్శకత్వంలో విశ్వంభర మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తుండగా చోట కె నాయుడు ఫోటోగ్రఫి అందిస్తున్నారు. యువి క్రియేషన్స్ సంస్థ భారీ వ్యయంతో గ్రాండ్ లెవెల్లో నిర్మిస్తున్న ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి ఆడియన్స్ ముందుకి రానుంది.

విషయం ఏమిటంటే, లేటెస్ట్ టాలీవుడ్ క్రేజీ ఇన్ఫో ప్రకారం మెగాస్టార్ చిరంజీవి తన నెక్స్ట్ మూవీకి తాజాగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తో పాటు మెగాస్టార్ కుమార్తె సుస్మిత ఈ మూవీని నిర్మించనున్నారట. టాలీవుడ్ డ్యాషింగ్ డైరెక్టర్ ఒకరు దీనిని తెరకెక్కించనుండగా దీనికి సంబందించిన పూర్తి వివరాలు అతి త్వరలో అధికారికంగా వెల్లడి కానున్నాయని తెలుస్తోంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు