ఎనర్జిటిక్ యాక్టర్ రామ్ పోతినేని – డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ కలయికలో ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా పై ఓ క్రేజీ రూమర్ వినిపిస్తోంది. ఈ సినిమాలో తమిళ హాట్ బ్యూటీ యషిక ఆనంద్ ఓ స్పెషల్ సాంగ్ చేయబోతుందట. సెకండ్ హాఫ్ లో వచ్చే యషిక ఆనంద్ సాంగ్ ఫుల్ బోల్డ్ గా ఉంటుందని.. మాస్ ఆడియన్స్ కి ఫుల్ కిక్ ఇస్తోందని.. అందుకే.. ఈ సాంగ్ లో యషిక ఆనంద్ ను తీసుకున్నారని టాక్. ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రం సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్నాడు.
కాగా ఈ సినిమా మహా శివరాత్రి సందర్భంగా మార్చి 8, 2024న తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో విడుదల కానుంది. పూరి జగన్నాధ్ మరియు ఛార్మి కౌర్ కలిసి పూరీ కనెక్ట్స్‌పై, విషు రెడ్డి సీఈవోగా ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఇస్మార్ట్ శంకర్ రామ్ కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు రాబట్టింది. మరి డబుల్ ఇస్మార్ట్ ఏ రేంజ్ లో సక్సెస్ అవుతుందో చూడాలి.