కృతి శెట్టికి మరో క్రేజీ ఆఫర్ ?

Published on Jun 27, 2021 11:00 pm IST

‘ఉప్పెన’తో ఫుల్ ఫాలోయింగ్ తెచ్చుకున్న క్రేజీ హీరోయిన్ కృతి శెట్టికి ఉన్న ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే ఆమెకు వరుస అవకాశాలు వస్తున్నాయి. తాజాగా కృతి శెట్టికి ఓ హిందీ సినిమాలో ఛాన్స్ వచ్చిందని తెలుస్తోంది. మరి ఈ టాలెంటెడ్ హీరోయిన్ కి వచ్చిన ఆ క్రేజీ ఆఫర్ గురించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇక మొదటి నుండి కృతి శెట్టి చాలా సెలెక్టెడ్‌ గా సినిమాలు చేస్తూ వస్తోంది. కృతి శెట్టి బాలీవుడ్ సినిమాకి ఒకే చెప్పిందని తెలుస్తోంది. మరి ఈ వార్తలో ఎంత నిజం ఉందనేది క్లారిటీ లేదు. కృతి శెట్టి స్వయంగా వెల్లడించే వరకు ఈ వార్తను అధికారికంగా ద్రువీకరించలేం. ఇక ప్రస్తుతం కృతి శెట్టి నాని సినిమాతో పాటు సుధీర్ బాబు సినిమాలో కూడా నటిస్తోంది.

సంబంధిత సమాచారం :