క్రేజీ : మరోసారి ఆస్కార్ స్టేజ్ పై “RRR” ఫీవర్

క్రేజీ : మరోసారి ఆస్కార్ స్టేజ్ పై “RRR” ఫీవర్

Published on Mar 11, 2024 10:53 AM IST

RRR 2

దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తన చిత్రాలతో ఇండియన్తెలుగు సినిమా ఖ్యాతిని అలాగే ఇండియన్ సినిమా ఖ్యాతిని ప్రపంచ స్థాయిలో ఓ రేంజ్ లో నిలబెట్టారు. మరి తాను మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అలాగే, యంగ్ టైగర్ ఎన్టీఆర్ లతో చేసిన గ్లోబల్ సెన్సేషనల్ చిత్రం “రౌద్రం రణం రుధిరం” ప్రపంచ ఆడియెన్స్ లో ఏ ఇండియన్ సినిమా కూడా అందుకోని భారీ క్రేజ్ ని సొంతం చేసుకోవడమే కాకుండా మొట్టమొదటి సారిగా ప్రఖ్యాత ఆస్కార్ అవార్డుని కూడా ఇండియాకి తీసుకొచ్చి చెరగని వన్నె తెచ్చిపెట్టింది.

మరి దీనితో భారతదేశం గర్వించదగ్గ సినిమాగా RRR నిలవగా ఇదే సమయానికి గత ఏడాదిలో ఆస్కార్ స్టేజ్ పై RRR ఫీవర్ నడుస్తూ ఉంది. అయితే ఇప్పుడు మళ్ళీ ఈసారి ఆస్కార్ వేడుకలో కూడా RRR విజువల్స్ కనిపించడం వైరల్ గా మారింది. 96వ అకాడమీ అవార్డ్స్ వేడుక యూఎస్ లో అట్టహాసంగా జరుగగా అక్కడ రెండు సందర్భాలలో RRR సినిమా నుంచి విజువల్స్ పడ్డాయి. దీనితో చిత్ర యూనిట్ మరోసారి ఆనందం వ్యక్తం చేయగా రెండో మన సినిమాకి ఆస్కార్ స్టేజ్ పై చోటు దక్కడంతో ఇండియా ఆడియెన్స్ కూడా ప్రైడ్ గా ఫీలవుతున్నారు. దీనితో ఇప్పుడు ఈ విజువల్స్ తో మరోసారి RRR పేరు మారుమోగుతోంది.

తాజా వార్తలు