తెలుగు హీరోయిన్ కి క్రేజీ ఛాన్స్ లు !

Published on Dec 1, 2020 1:30 am IST

తెలుగు సినీ పరిశ్రమ నుండి హీరోయిన్ గా ఎదిగిన తెలుగు అమ్మాయి ‘రీతూ వర్మ’. ప్రస్తుతం టాలీవడ్ నుండి కూడా తాజాగా మంచి సినిమా అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందుకు సాగుతొంది. అయితే రీతూ వర్మ టాలెంట్ ను ముందుగా తమిళ చిత్ర పరిశ్రమ గుర్తించింది. ముఖ్యంగా కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ ఆమె నటన చూసి.. తనతో కలిసి నటించే అవకాశం ఇచ్చాడు. ఇక అప్పటి నుండి పలు తమిళ సినిమాలతో పాటు మలయాళ సినిమాలు కూడా చేసి తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది.

కాగా తాజాగా రీతూ వర్మకు తెలుగులో కూడా ప్రస్తుతం మంచి అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే నేచురల్ స్టార్ నానితో టక్ జగదీష్ చేస్తుంది. అలాగే యంగ్ హీరో శర్వానంద్ నటించే తెలుగు, తమిళ సినిమాతో పాటు మరో టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య సరసన రీతూవర్మ నటిస్తోంది. ఈ క్రమంలో రవితేజ – రమేష్ వర్మ చేయబోతున్న సినిమాలో కూడా రీతూ వర్మనే హీరోయిన్ గా నటిస్తోందట. అలాగే తరుణ్ భాస్కర్ వెంకీతో చేయబోతున్న సినిమాలో ఓ కీలక పాత్రలో రీతూ వర్మ నటించబోతుందని తెలుస్తోంది. మొత్తానికి బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ప్రాజెక్ట్స్ తో రీతూ వర్మ బాగా బిజీ అయింది.

సంబంధిత సమాచారం :

More