కమల్ సినిమా కోసం క్రేజీ ప్రమోషన్స్

కమల్ సినిమా కోసం క్రేజీ ప్రమోషన్స్

Published on Apr 30, 2015 8:29 AM IST

uttam-villani

సినిమా సినిమాకి నటనలోనే కాకుండా కథల విషయంలో కూడా వైవిధ్యం చూపుతూ సరికొత్త ఐడియాలతో ప్రేక్షకులను మెప్పించే సినిమాలు చేస్తున్న స్టార్ హీరో ఉలగనాయగన్ కమల్ హాసన్. కమల్ హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఉత్తమ విలన్’. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో మే 1న అనగా రేపు ప్రేక్షకుల ముందుకు రానుంది. గత కొద్ది రోజులుగా ఈ సినిమా కోసం క్రేజీ ప్రమోషన్స్ జరుగుతున్నాయి. ముఖ్యంగా తమిళ మీడియా వారు ఎంతో వినూత్నంగా కమల్ హాసన్ నటించిన కొన్ని రేర్ ఫోటోలను స్పెషల్ గా డిజైన్ చేసి పబ్లిసిటీ చేస్తుంటే, కొందరు కమల్ హాసన్ యానిమేషన్ ఫోటోలతో పబ్లిసిటీ చేస్తున్నారు.

ప్రస్తుతం తెలుగు, తమిళ సోషల్ మీడియాలో చాలా కొత్త తరహాలో ఉత్తమ విలన్ కి ప్రమోషన్స్ జరుగుతున్నాయి. కమల్ హాసన్ హీరోగానే కాకుండా కథ – స్క్రీన్ ప్లే అందించిన ఈ సినిమాకి రమేష్ అరవింద్ డైరెక్టర్. ఒక సినీ నటుడు జీవితం చుట్టూ తిరిగే ఈ కథలో రియల్ లైఫ్ మూవీ లెజెండ్స్ అయిన బాల చందర్, కె.విశ్వనాధ్ లు నటించారు. కమల్ హాసన్ సరసన పూజ కుమార్, ఆండ్రియా జెరెమియా హీరోయిన్స్ గా నటించారు. జిబ్రాన్ మ్యూజిక్ అందించిన ఈ ఆల్బంలో మొత్తం 16 ట్రాక్స్ ఉన్నాయి.

తాజా వార్తలు