సన్నీ లియోన్ పింక్ లిప్స్ – చాలా హాట్ గురూ..

సన్నీ లియోన్ పింక్ లిప్స్ – చాలా హాట్ గురూ..

Published on Jul 1, 2014 12:50 PM IST

sunny-leone
సన్నీ లియోన్ పింక్ లిప్స్ – చాలా హాట్ గురూ.. అంటున్నారు హిందీ సినిమా ప్రేక్షకులు. రెండు రోజుల క్రితం విడుదలైన పింక్ లిప్స్ సాంగ్ టీజర్ బాలీవుడ్ ప్రేక్షకులను, శృంగారప్రియులను అమితంగా ఆకట్టుకుంది. విశాల్ పాండ్య దర్శకత్వంలో విక్రమ్ భట్ నిర్మిస్తున సినిమా ‘హేట్ స్టొరీ-2’ సుర్విన్ చావ్లా హీరోయిన్. ఈ సినిమాలో సన్నీ లియోన్ ఒక ప్రత్యెక గీతంలో నటిస్తుంది. అదే పింక్ లిప్స్ సాంగ్.

పింక్ లిప్స్ సాంగ్ టీజర్ లో సన్నీ లియోన్ మరోసారి తన తడాఖా చూపించింది. చిట్టి పొట్టి బట్టలు వేసుకుని కుర్రకారుకి మత్తెకించే నృత్య భంగిమలతో తెరపై మరోసారి రెచ్చిపోయింది. శృంగారప్రియులకు మరోసారి విందు భోజనం ఖాయమనే సంకేతాలు పంపించింది. ప్రస్తుతం ఈ పాట ఇంటర్నెట్లో హాట్ టాపిక్ అయ్యింది. ‘హేట్ స్టొరీ-2’ ట్రైలర్ కూడా హాట్ సన్నివేశాలతో నిండిపోవడంతో సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి.

‘షూటౌట్ ఎట్ వాదాలా’ సినిమాలో ‘సన్నీ లియోన్’ నటించిన ‘ఓ లైలా తేరి.. ‘ పాట అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది. సినిమాకు భారి ఓపెనింగ్స్ తీసుకురావడంలో సహకరించింది. పింక్ లిప్స్ సాంగ్ ‘హేట్ స్టొరీ-2’కు ఎంత వరకు హెల్ప్ అవుతుందో? వేచి చూడాలి.

సన్నీ లియోన్ పింక్ లిప్స్ సాంగ్ టీజర్ :

తాజా వార్తలు