బాలయ్య ‘అఖండ’ పై క్రేజీ రూమర్ !

Published on May 1, 2021 3:41 pm IST

బాలయ్య బోయపాటి శ్రీను కలయికలో వచ్చిన అఖండ టీజర్ సృష్టిస్తోన్న సంచలనాల గురించి తెలిసిందే. వ్యూస్ పరంగా యూట్యూబ్ లో ఏకంగా 50 మిలియన్ల మార్క్ ను దాటి కొత్త రికార్డ్స్ ను సృష్టిస్తోంది. కాగా అఖండ శాటిలైట్ డీల్ కూడా కుదుర్చుకుందని తెలుస్తోంది. భారీ మొత్తానికి అనగా 19 కోట్ల రూపాయలకు స్టార్ మా సంస్థ ‘అఖండ’ శాటిలైట్ రైట్స్ చేజిక్కించుకుందట. మరి ఇందులో ఎంత నిజం ఉందో అధికారిక అప్ డేట్ వచ్చే వరకూ నమ్మలేం.

ఇక బోయపాటి బ్రాండ్ కూడా ఈ సినిమాకి లభిస్తోన్న భారీ మార్కెట్ కు ఒక కారణం. మొత్తానికి బోయపాటి – బాలయ్య కాంబినేషన్ లో రూపొందుతోన్న ఈ మూడో మూవీకి భారీ రేట్లు పలుకుతుండటంతో.. నిర్మాత మిరియాల రవీందర్ రెడ్డికి పెద్ద రిలీఫ్ లా ఉంది. ఇక సినిమాలో అఘోర పాత్రకు సంబధించిన సీక్వెన్స్ లు చాల బాగుంటాయట, ఇక బాలయ్యకు ‘సింహ’ రూపంలో పెద్ద హిట్ ఇచ్చిన బోయపాటి ఆ తర్వాత దాన్ని మించి ‘లెజెండ్’ విజయాన్ని అందించాడు, ఈ సారి ‘లెజెండ్’ను మించిన హిట్ ఇస్తాడో..లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :