“సర్కారు వారి పాట”పై క్రేజీ రూమర్..ఎంతవరకు నిజం?

Published on Jun 14, 2021 6:38 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా కీర్తీ సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న లేటెస్ట్ అండ్ మోస్ట్ అవైటెడ్ చిత్రం “సర్కారు వారి పాట”. దర్శకుడు పరశురామ్ పెట్ల తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇక ఇదిలా ఉండగా ఈ చిత్రం రెండో షెడ్యూల్ కూడా స్టార్ట్ కావడానికి సిద్ధంగా ఉన్న నేపథ్యంలో మరో క్రేజీ బజ్ ఇపుడు బయటకి వచ్చింది. ఈ చిత్రంలో మహేష్ ఇద్దరు పిల్లలు గౌతమ్ ఘట్టమనేని మరియు సితార కూడా ఉన్నారని రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి.

అయితే ఇందులో ఎలాంటి నిజమూ లేదని తెలుస్తుంది. అది కేవలం అవాస్తవ వార్త మాత్రమే అని సినీ వర్గాలు కన్ఫర్మ్ చేస్తున్నాయి. సో ఇందులో ఎలాంటి నిజం లేదని చెప్పాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా మైత్రి మూవీ మేకర్స్ మరియు 14 రీల్ ఎంటర్టైన్మెంట్స్ సహా మహేష్ నిర్మాణ కలిసి సంయుక్తంగా నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

సంబంధిత సమాచారం :