అల్లు అర్జున్- కొరటాల మూవీ స్టోరీ లైన్ పై క్రేజీ రూమర్స్

Published on Aug 2, 2020 4:49 pm IST

అల్లు అర్జున్ ఫ్యాన్స్ ని ఫిదా చేసిన న్యూస్ కొరటాలతో మూవీ. టాలీవుడ్ లో దర్శకుడు రాజమౌళి తరువాత ఓటమి ఎరుగని దర్శకుడిగా కొరటాల శివ ఉన్నారు. మరి అలాంటి దర్శకుడితో మూవీ అంటే ఖచ్చితంగా మరో హిట్ ఖాతాలో వేసుకున్నట్లే. ఇప్పటికే త్రివిక్రమ్ తో చేసిన అల వైకుంఠపురంలో మూవీతో భారీ హిట్ ఖాతాలో వేసుకున్న బన్నీ నెక్స్ట్ సుకుమార్ మరియు కొరటాల శివను లైన్ లో పెట్టి సక్సెస్ జర్నీ పై హింట్ ఇచ్చారు.

కాగా కొరటాలతో ఆయన 21వ చిత్ర కథపై అనేక పుకార్లు చక్కర్లు కొడుతున్నాయి. కొరటాల శివ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న బర్న్నింగ్ టాపిక్ పై మూవీ చేస్తున్నారట. ఈ మధ్య వైజాగ్ లో వరుసగా పారిశ్రామిక ప్రమాదాలు జరిగాయి. దాని వలన కొంత ప్రాణనష్టం జరిగింది. గతంలో కూడా ఓ ఎన్ జి సి గ్యాస్ లీకేజి వలన కొంత ప్రాణ నష్టం జరిగింది. కొరటాల శివ ఈ టాపిక్ నే సబ్జెక్టుగా తీసుకొని కమర్షియల్ అంశాలు జోడించి తెరకెక్కిస్తున్నాడని సమాచారం. ఈ విషయంలో నిజం ఎంతో తెలియదు కానీ జోరుగా ప్రచారం అవుతుంది.

సంబంధిత సమాచారం :

More