‘ఐకాన్’లో అల్లు అర్జున్ ఇంత సాహసం చేస్తున్నాడా ?

Published on Jun 22, 2021 1:12 am IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వరుసగా చాలా సినిమాలను లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన సుకుమార్ దర్శకత్వంలో ‘పుష్ప’ చేస్తున్నారు. ఈ సినిమాను రెండు భాగాలుగా చేయాలని ఇటీవలే డిసైడ్ చేశారు. దీంతో అల్లు అర్జున్ ప్లాన్స్ కూడ మారాయట. ‘పుష్ప-1’ ముగింపు దశలో ఉంది. అది పూర్తికాగానే సెకండ్ పార్ట్ మొదలుపెట్టడానికి కాస్త టైమ్ పట్టేలా ఉంది. అందుకే ఈలోపు ‘ఐకాన్’ చిత్రాన్ని మొదలుపెట్టాలని అనుకుంటున్నారట. ప్రస్తుతం వేణు శ్రీరామ్ కథలో మార్పులు చేర్పులు చేస్తున్నారు.

త్వరలోనే స్టోరీ లాక్ అవుతుందట. అయితే తాజాగా ఈ సినిమా మీద సోషల్ మీడియాలో ఒక రూమర్ మొదలైంది. అదేమిటంటే ఇందులో బన్నీ చూపులేని వ్యక్తిగా కనిపిస్తారని. అందుకే ‘ఐకాన్’ టైటిల్ కింద ‘కనబడటలేదు’ అని ట్యాగ్ లైన్ పెట్టడం జరిగిందని చెబుతున్నారు. బన్నీ లాంటి స్టార్ హీరో కంటిచూపు లేని పాత్రలో చేయడం నిజంగా పెద్ద ప్రయోగమే. ఇంత ప్రయోగం కాబట్టే ప్రాజెక్ట్ మీద ఇన్ని రోజులు తర్జనభర్జనలు జరిగాయని అంటున్నారు. మరి ఈ వార్తల్లో ఎంతమేర వాస్తవముందో తెలియాలి అంటే టీమ్ సభ్యుల్లో ఎవరో ఒకరు స్పందించే వరకు ఆగాల్సిందే.

సంబంధిత సమాచారం :