‘రాధేశ్యామ్’ విషాదపూరిత ప్రేమ కథా ?

Published on Jul 1, 2021 12:19 am IST

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న చిత్రం ‘రాధేశ్యామ్’. ఈ చిత్రం మీద ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్న సంగతి తెలిసిందే. రాధాకృష్ణ దర్శకత్వంలో ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణా మూవీస్‌ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. షూటింగ్ చివరి దశలో ఉంది సినిమా. ప్రభాస్ చేస్తున్న సినిమాల్లో ఇది డిఫరెంట్ మూవీ. ఎందుకంటే ఇదొక లవ్ స్టోరీ. లవ్ స్టోరీ అంటే సాదాసీదా లవ్ స్టోరీ కాదు.. కొన్నేళ్లపాటు గుర్తుండిపోయే లవ్ స్టోరీ అని చిత్ర బృందం మొదటి నుండి చెబుతూనే ఉన్నారు.

కథలో ప్రభాస్, పూజా హెగ్డేల నడుమ సాగే ప్రేమ కథ చాలా ఉద్వేగపూరితంగా ఉంటుందని అంటూ వచ్చారు. ఏ ప్రేమ కథ అయినా గొప్పదిగా మిగిలిపోవాలి అంటే అది విషాదాంతం కావాల్సిందే. చరిత్రలో నిలిచిపోయిన ఏ ప్రేమ కథను చూసినా అది విషాదపూరితంగా ముగిసిన కథయే. అలాగే ‘రాధేశ్యామ్’ కథ కూడ చివర్లో కన్నీళ్లు పెట్టించేలా ఉంటుందని సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది. పూజా హెగ్డే చేస్తున్న ప్రేరణ పాత్ర సినిమా ముగింపులో మరణిస్తుందని, అదే సినిమాకు హైలెట్ అని, ఆ సన్నివేశాలు ప్రేక్షకుల చేత కన్నీళ్లు పెట్టిస్తుందని అంటున్నారు. మరి ఈ సోషల్ మీడియా చర్చల్లో ఎంత నిజం ఉందో సినిమా విడుదలయ్యాకనే తెలుస్తుంది.

సంబంధిత సమాచారం :