కాజల్ అగర్వాల్ కి అన్నగా మంచు విష్ణు !

Published on Aug 3, 2020 4:00 pm IST

మంచు విష్ణు హీరోగా వస్తోన్న సినిమా ‘మోసగాళ్లు’. అయితే ఈ చిత్రంలో విష్ణు మంచు, కాజల్ అగర్వాల్ అన్నయ్య చెల్లిగా జత కట్టారు. గతంలో, జోష్ లో షారుఖ్ ఖాన్ మరియు ఐశ్వర్య రాయ్ మరియు పాత సినిమాలో ఎన్టీఆర్-సావిత్రి వంటి తారలు ఆన్న చెల్లిగా నటించారు. ఇప్పుడు కాజల్ విష్ణు నటిస్తున్నారు.

ఇక సినిమా కథ గురించి విష్ణు ఇటివలె ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో.. ఈ సినిమా యూనివర్సల్ స్టోరీతో రాబోతుందని.. హాలీవుడ్ లో కూడా ఈ సినిమా బాగా ఆకట్టుకుంటుందని, ఇక తెలుగు వర్షన్ లో కొన్ని మార్పులు చేశామని.. ఈ సినిమా నాకు సూపర్ హిట్ ను అందిస్తోందని విష్ణు నమ్మకంగా చెప్పుకొచ్చారు.

కాగా ఈ మూవీలో కాజల్ అగర్వాల్, బాలీవుడ్ స్టార్ సునీల్ శెట్టి మరో రెండు ప్రధాన పాత్రలు చేస్తున్నారు. టెర్రిఫిక్ స్టోరీ, క్యారెక్టరైజేషన్, యాక్షన్ మేళవిపుంతో తయారవుతున్న ‘మోసగాళ్లు’ చిత్రాన్ని జెఫ్రీ గీ చిన్ డైరెక్ట్ చేస్తున్నారు.

సంబంధిత సమాచారం :

More