ఇది “RRR”ల కథ.. “క్రేజీ అంకుల్స్” ట్రైలర్ రిలీజ్..!

Published on Aug 14, 2021 11:59 pm IST

శ్రీముఖి, భరణి, మనో, భరణి, రాజా రవీంద్ర ప్రధానా పాత్ర‌ల్లో నటిస్తున్న రొమాంటిక్ కామెడీ థ్రిల్లర్ “క్రేజీ అంకుల్స్”. ఇ. సత్తిబాబు దర్శకత్వంలో గుడ్ సినిమా గ్రూప్, గ్రీన్ మెట్రో మూవీస్‌, శ్రీవాస్ 2 క్రియేటీవ్స్ బ్యానర్స్‌పై గుడ్ ఫ్రెండ్స్, బొడ్డు అశోక్ కలిసి సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఆగష్టు 19న ఈ సినిమా థియేటర్లలో రిలీజ్ కాబోతుంది. అయితే తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను చిత్ర బృందం రిలీజ్ చేసింది.

అయితే బేసిక్‌గా ఇది హైదరబాద్‌లో ఉంటున్న రాజు.. రెడ్డి.. రావుల కథ అని అంటే ‘ఆర్ఆర్ఆర్’ల కథ అన్నట్టు ట్రైలర్ ద్వారా చెప్పుకొచ్చారు. అయితే అనుకోకుండా ఈ ముగ్గురు ఉండే అపార్ట్‌మెంట్‌లోకి ఓ అందమైన అమ్మాయి అడుగుపెడుతుంది. ఎలాగైనా ఆ అమ్మాయితో గడపాలునుకున్న ఈ ముగ్గురి వ్యధ తీరిందా? ఈ క్రమంలో ఆ ముగ్గురి కథ ఎలాంటి మలుపులు తీసుకుంది? అనేది తెలియాలంటే ఈ సినిమాను చూడాల్సిందే. ఇక అప్పటి వరకు ఈ ట్రైలర్ వైపు ఓ లుక్కేయండి.

ట్రైలర్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం :