అఖండ క్లైమాక్స్ పై క్రేజీ అప్ డేట్ !

Published on Nov 8, 2021 9:30 pm IST

నటసింహం బాలయ్య – యాక్షన్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో రాబోతున్న సినిమా ‘అఖండ’. కాగా ఈ సినిమాలో హీరో శ్రీకాంత్ విలన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, అఖండ క్లైమాక్స్ సినిమా మొత్తంలోనే హైలైట్ గా ఉంటుందట. ముఖ్యంగా శ్రీకాంత్ పాత్ర నుంచి వచ్చే ట్విస్ట్ థ్రిల్ చేస్తోందని తెలుస్తోంది. పక్కా ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రానున్న ఈ సినిమాలో శ్రీకాంత్ లుక్, అండ్ ఆయన పాత్ర వేషధారణ కూడా పూర్తి డిఫరెంట్ గా ఉండబోతున్నాయట.

లెజెండ్ లో జగపతి బాబును కొత్తగా చూపించిన బోయపాటి, ఈ సారి శ్రీకాంత్ ను కొత్తగా చూపించనున్నారు. ఇక బాలయ్య – శ్రీకాంత్ మధ్య వచ్చే యాక్షన్‌ సీక్వెన్స్‌ హైలైట్‌ గా ఉంటాయట. ఈ సినిమాని మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మించనుండగా తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఏది ఏమైనా ఈ సినిమా పై బాలయ్య ఫ్యాన్స్ బాగా హోప్స్ పెట్టుకున్నారు.

సంబంధిత సమాచారం :

More