‘వీర సింహారెడ్డి’లో ఆ ట్విస్ట్ చాలా ఎమోషనల్ ?

‘వీర సింహారెడ్డి’లో ఆ ట్విస్ట్ చాలా ఎమోషనల్ ?

Published on Oct 31, 2022 7:16 PM IST

నంద‌మూరి బాల‌కృష్ణ హీరోగా గోపీచంద్ మ‌లినేని దర్శకత్వంలో రాబోతున్న’వీర సింహారెడ్డి’ సినిమా ఇంటర్వెల్ పై ఒక ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వినిపిస్తోంది. ఈ ఇంటర్వెల్ దగ్గరే బాలయ్య – శ్రుతి హాసన్ క్యారెక్టర్లకు సంబంధించిన ట్విస్ట్ రివీల్ అవుతుందని.. సినిమా మొత్తంలోనే ఈ ట్విస్ట్ చాలా ఎమోషనల్ గా ఉంటుందని.. పైగా సినిమాకే మెయిన్ హైలైట్ గా ఉంటుందని తెలుస్తోంది.

మరి ఇంతకీ ఆ ట్విస్ట్ ఏమిటో చూడాలి. కాగా థమన్ ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నాడు. ఇక ‘డాన్ శీను, బలుపు, పండగ చేస్కో’ లాంటి సినిమాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకుని.. ‘క్రాక్’ సినిమాతో భారీ కమర్షియల్ హిట్ కొట్టి యాక్షన్ డైరెక్టర్ గా గోపీచంద్ మలినేని స్టార్ డమ్ సాధించాడు. మరి ప్రస్తుతం బాలయ్యతో సినిమా చేస్తున్న వీర సింహా రెడ్డి తో.. ఇక గోపిచంద్ ఏ రేంజ్ హిట్ కొడతాడో చూడాలి. ఈ సినిమా పై అయితే మంచి అంచనాలు ఉన్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు