‘కల్కి’ కోసం కీలక షెడ్యూల్

‘కల్కి’ కోసం కీలక షెడ్యూల్

Published on Mar 18, 2024 12:32 PM IST

నేషనల్ స్టార్ ప్రభాస్ హీరోగా – నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ‘కల్కి 2898 AD’ అనే ఫాంటసీ సైంటిఫిక్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ప్రభాస్, దిశా పటానితో ఓ రొమాంటిక్ సాంగ్‌ ను షూట్ చేశారు. ఇప్పుడు ఈ సినిమా తర్వాత షెడ్యూల్ లో కమల్ హాసన్ – ప్రభాస్ – అమితాబ్ బచ్చన్ కీలక సన్నివేశాలను షూట్ చేయనున్నారు. ఇందుకోసం, రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్ ను కూడా వేశారు. ఈ షెడ్యూల్ చాలా కీలకం అట.

అన్నట్టు రీసెంట్ గా ఈ మూవీ క్లైమాక్స్‌ కు ముందు వచ్చే సన్నివేశాల్లో పరశురాముడిగా జూనియర్ ఎన్టీఆర్, కృపాచార్యుడి పాత్రలో నాని కనిపిస్తారని టాక్ నడిచింది. ఈ రూమర్ పై కూడా ఇంకా క్లారిటీ లేదు. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ సూపర్‌ స్టార్ అమితాబ్ బచ్చన్ కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. మొత్తానికి పాన్ -ఇండియా చిత్రంగా ఈ సినిమాని మలచడానికి నాగ్ అశ్విన్ బాగా ప్రయత్నాలు చేస్తున్నాడు. వైజయంతీ మూవీస్‌ పతాకంపై అశ్వనీదత్‌ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు