దర్శకధీరుడు రాజమౌళి – మహేష్ బాబు సినిమా ‘వారణాసి’ని హాలీవుడ్ స్థాయిలో నిర్మించబోతున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రా నటిస్తోంది. వచ్చే నెల మొదట వారంలో మహేష్, ప్రియాంక చోప్రా కాంబినేషన్లో ఓ సాంగ్ చిత్రీకరణకు మూవీ యూనిట్ ప్లాన్ చేసిందట. ఈ సాంగ్ కోసం ఓ భారీ సెట్ వేస్తున్నట్లు తెలుస్తోంది. భారీ స్థాయిలో, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సాంగ్ లో విజువల్స్ అద్భుతంగా ఉంటాయట. అన్నట్టు ‘వారణాసి’ చిత్రం రూ.1300 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో నిర్మితమవుతోంది.
కాగా ఈ భారీ ప్రాజెక్ట్‌ను కెఎల్ నారాయణ, ఎస్ఎస్ కార్తికేయ నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు దేశవ్యాప్తంగా మంచి స్పందన లభించింది. ఈ చిత్రానికి సంగీతాన్ని ఎంఎం కీరవాణి అందిస్తుండగా, కథా కథనాన్ని విజయేంద్ర ప్రసాద్ రూపొందించారు. ఇక ఈ సినిమాకి దేవా కట్టా సంభాషణలు అందిస్తున్నారు. ఈ సినిమాను పూర్తిగా IMAX ఫార్మాట్లో చిత్రీకరిస్తుండగా, పలు భాషల్లో విడుదల చేయనున్నారు.
