‘హరిహర వీరమల్లు’ యాక్షన్ సీక్వెన్స్ కోసం సన్నద్ధం !

‘హరిహర వీరమల్లు’ యాక్షన్ సీక్వెన్స్ కోసం సన్నద్ధం !

Published on Aug 23, 2021 10:31 PM IST

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – క్రియేటివ్ డైరెక్టర్ క్రిష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘హరిహర వీరమల్లు’ సినిమా యాక్షన్ సీక్వెన్స్ కోసం ప్రత్యేక సెట్స్ వేస్తోన్నట్లు తెలుస్తోంది. ఈ షెడ్యూల్ తో సినిమాకి కీలక భాగం షూటింగ్ మొత్తం పూర్తి అవుతుందట. అన్నట్టు వచ్చే నెల మొదటి వారం నుండి ఈ యాక్షన్ సీక్వెన్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. పది రోజులు పాటు సాగే ఈ షూట్ లో సీన్స్ ఇంటర్వెల్ లో వస్తాయట.

కాగా మొఘల్ కాలం నాటి ఫిక్షన్ కథతో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాలో జాక్వెలిన్ ఫెర్నాండెజ్ ఓ కీలక పాత్రలో నటిస్తోంది. కాగా ఈ సినిమాని పాన్ ఇండియన్ సినిమాగా తీసుకురానున్నారు. ప్రముఖ నిర్మాత ఏ ఎమ్ రత్నం మొత్తానికి ఈ సినిమాని భారీగా నిర్మిస్తున్నారు. ఈ పిరియాడికల్ మూవీ వచ్చే సంక్రాంతి బరిలోనే దిగనుంది.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు