
హిందీలో విశేష గుర్తింపు ను పొందిన బుల్లితెర రియల్టీ గేమ్ షో ‘బిగ్ బాస్’ ప్రస్తుతం 12వ సీజన్ లోకి అడుగు పెట్టింది. బాలీవడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఈషో ఇటీవల గోవా లో గ్రాండ్ గా లాంచ్ అయ్యింది. ఇక తాజాగా ఈ షోలో కంటెస్టెంట్ గా హౌస్ లోకి అడుగుపెట్టనున్నారు కేరళకు చెందిన ప్రముఖ క్రికెటర్ శ్రీశాంత్.
ఫిక్సింగ్ లో పట్టుపడి క్రికెట్ కు శాశ్వతంగా దూరమైన శ్రీశాంత్ తాజాగా ఓక చిత్రంలో కూడా నటిస్తున్నారు. ఇక సల్మాన్ ఖాన్ 9వ సారి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ఈషో ఈరోజు నుండి ప్రసారం కానుంది. ఇక ఈసీజన్ లో శ్రీశాంత్ తో పాటు బాలీవుడ్ సెలబ్రెటీలు నెహ్హ పెండ్సే ,దీపికా కక్కర్ , అనూప్ జలోతియా, భారతి సింగ్, హార్ష్ లింబాచియాలు మరియు కరణ్ వీర్ బొహ్ర కంటేస్టెంట్స్ గా హౌస్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారు.
ఇక తెలుగు, తమిళ బాషల్లోకూడా పాపులర్ అవుతుంది ఈ షో. ప్రస్తుతం ఈ రెండు భాషల్లో సెకండ్ సీజన్ జరుగుతుంది. మరో రెండువారాల్లో ఈ సీజన్ ముగియనుంది. తెలుగు బిగ్ బాస్ కు హోస్ట్ గా నాని వ్యవహరిస్తుండగా, తమిళ బిగ్ బాస్ కు కమల్ హాసన్ హోస్ట్ చేస్తున్నారు.

