మరో వారంలో ‘కరెంట్ తీగ’ టీజర్..

మరో వారంలో ‘కరెంట్ తీగ’ టీజర్..

Published on Aug 16, 2014 5:46 PM IST

Current-Teega

‘పోటుగాడు’ తర్వాత మనోజ్ సోలో హీరోగా నటిస్తున్న సినిమా ‘కరెంట్ తీగ’. ఇటివలే ఈ సినిమా క్లైమాక్స్ సన్నివేశాల చిత్రీకరణ పూర్తయింది. మరో వారం రోజులలో ‘కరెంట్ తీగ’ ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేస్తున్నట్టు మంచు మనోజ్ చెప్పారు. ‘దేనికైనా రెడీ’తో మంచు విష్ణుకు కమర్షియల్ సక్సెస్ అందించిన దర్శకుడు జి.నాగేశ్వర రెడ్డి తమ్ముడు మనోజ్ ను ఎలా చూపిస్తున్నారో.? తెలియాలంటే మరో వారం ఆగాల్సిందే.

మంచు మనోజ్ సరసన రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో సన్నీ లియోన్ ప్రత్యేక పాత్రలో నటించింది. సన్నీ లియోన్ చేసిన స్పెషల్ సాంగ్ సినిమాలు స్పెషల్ అట్రాక్షన్ గా నిలుస్తుందని సినిమా యూనిట్ సభ్యులు భావిస్తున్నారు. మంచు విష్ణు నిర్మిస్తున్న ఈ సినిమాకు అచ్చు సంగీతం అందిస్తున్నారు. సినిమా ఆడియో రిలీజ్ డేట్ & ఇతర వివరాలు త్వరలో వెల్లడించనున్నారు.

తాజా వార్తలు