రాకింగ్ స్టార్ మంచు మనోజ్, రకుల్ ప్రీత్ సింగ్ జంటగా జి.నాగేశ్వర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘కరెంట్ తీగ’. మంచు విష్ణు నిర్మాత. ఈ నెల 31న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ఓవర్సీస్ రిలీజ్ విషయంలో రికార్డు సృష్టించడానికి రెడీ అవుతుంది.
ఇండియాలో కాకుండా మొత్తం 25 దేశాలలో ‘కరెంట్ తీగ’ సినిమా విడుదలవుతుంది. 2014లో ఒక ఇండియన్ రీజినల్ సినిమా ఇన్ని దేశాలో విడుదల కానుండం ఇదే మొదటిసారి. ఓవర్సీస్ రిలీజ్ విషయంలో ఇదొక రికార్డు. మంచు కుటుంబానికి చెందిన 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ ఈ సినిమాను ఓవర్సీస్ లో డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. అమెరికాలో ఈ సినిమా ప్రీమియర్ షోలను ఒక్క రోజు ముందు అక్టోబర్ 30న ప్రదర్శిస్తున్నారు.
అచ్చు అందించిన ఆడియో హిట్ టాక్ సొంతం చేస్తుంది. సన్నీ లియోన్ అతిధి పాత్రలో నటించింది. యాక్షన్ – కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాపై ప్రేక్షకులలో భారి అంచనాలు నెలకొని ఉన్నాయి. వాటిని చేరుకుంటాం అనే దీమాను చిత్ర బృందం వ్యక్తం చేస్తుంది.


