25కు పైగా ప్రాజెక్ట్స్ చేస్తున్న విజయ్ సేతుపతి

Published on Jun 18, 2021 2:02 am IST

తనకు హీరో అనిపించుకోవడం కంటే మంచి నటుడు అని పిలిపించుకోవడమే ఇష్టం అంటారు విజయ్ సేతుపతి. ఆయన ఫాలో అయిన ఆ ఫార్ములానే ఈరోజు ఆయన్ను సౌత్ ఇండియాలోనే బీజీ నటుడ్ని చేసింది. దక్షిణాదిన విజయ్ సేతుపతికి ఉన్న డిమాండ్ మరే నటుడికీ లేదు. కేవలం హీరో అనే చట్రంలోనే ఇరుక్కుని ఉంటే సేతుపతి ఈరోజు ఇంత బిజీగా ఉండేవారు కాదు. ప్రస్తుతం ఆయన చేతిలో 25కు పైగా ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అన్నీ మేకింగ్ దశలోనే ఉన్నాయి. వీటిలో సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. మెజారిటీ చిత్రాలు తమిళ భాషలో ఉండగా తెలుగు, హిందీ, మలయాళం భాషల్లో కూడ సినిమాలు చేస్తున్నారు ఆయన.

కేవలం సినిమాలే కాదు డిజిటల్ ప్రాజెక్ట్స్ కూడ చేస్తున్నారు విజయ్ సేతుపతి. వీటితో పాటే ఒక టీవీ షో కూడ చేస్తున్నారు. నటుడిగానే కాదు. నిర్మాతగానూ సేతుపతి ఫుల్ బిజీగా ఉంటున్నారు. ఆయన కొన్ని సినిమాలను స్వయంగా నిర్మిస్తున్నారు. అంతేకాదు కొన్నింటికి రచనా సహకారం కూడ చేస్తున్నారు. ఇలా మొత్తం ఆయన చేతిలో 25కి పైగా సినిమాలున్నాయి. డేట్స్ అడ్జెస్ట్ చేయలేక కొన్ని భారీ సినిమాలను వదులుకున్నారు కూడ. వాటిలో ఆమిర్ ఖాన్ సినిమా కూడ ఉంది. స్టార్ అంటే కేవలం హీరోలు మాత్రమే కాదని క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడ స్టార్లు కాగలరని ఈమాధకాలంలో ప్రూవ్ చేశారు విజయ్ సేతుపతి.

సంబంధిత సమాచారం :