షారుఖ్ ఖాన్ కెరీర్ ని మలుపు తిప్పిన సినిమా మరియు 1990లలో సెన్సేషన్ క్రియేట్ చేసిన సినిమా ‘దిల్ వాలే దుల్హనియా లే జాయేంగే’. ఆదిత్య చోప్రా దర్శకత్వం వహించి నిర్మించిన ఈ సినిమా1995 అక్టోబర్ 19న రిలీజ్ అయ్యింది. ఈ సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ముంబైలోని ‘మరత మందిర్’లో ఇప్పటి వరకూ కంటిన్యూగా ఆడుతోంది.
ఇలా 1995 నుంచి కంటిన్యూగా రన్ అవుతున్న ఈ సినిమా ఇప్పటి వరకూ 950 వారాలు పూర్తి చేసుకుంది. ఇండియాలోనే ఒక సినిమా ఇన్ని వారాలు కంటిన్యూగా ప్రదర్శించిన ఘనత ఈ సినిమాకే దక్కింది. కానీ ఇప్పుడు విషయం ఏమిటంటే డిసెంబర్ తో ఈ సినిమా థియేటర్ లో ప్రదర్శించడం మొదలు పెట్టి 1000 వారాలవుతుంది. ఆ వారంతో ఆ సినిమాని థియేటర్ నుండి తీసెయ్యాలని ఆ థియేటర్ ఓనర్స్ డిసైడ్ అయ్యారు. దీంతో ఓ అరుదైన రికార్డ్ కి శుభం కార్డ్ పడనుంది.


