‘మా’ అధ్యక్ష ఎన్నికల బరిలో మరో నటుడు !

Published on Jun 27, 2021 7:00 pm IST

మూవీ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ ఎన్నికలలో ఇప్పటికే నలుగురు బరిలో నిలిచారు. వారి మధ్య నెలకొన్న పోటీ తీవ్రతకే మా ఎన్నికల హడావుడి రోజుకొక మలుపు తిరుగుతుంది. అయితే తాము అధ్యక్ష పదవి బరిలో ఉన్నామంటూ రోజుకో ఆర్టిస్ట్‌ ముందుకొస్తుండటమే ఇప్పుడు ప్రధాన టాపిక్ అయింది. తాజాగా విలక్షణ పాత్రలు పోషించిన సీనియర్‌ నటుడు సీవీఎల్‌ నరసింహారావు కూడా పోటీ చేస్తోన్నట్లు ప్రకటించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ‘ఈ సారి ‘మా’ బరిలో నేను ఉన్నాను. అయితే నాకంటూ ఏ ప్యానెల్ లేదు. నేను స్వతంత్ర అభ్యర్ధిగా పోటీకి దిగుతున్నాను అంటూ ఆయన ఈ రోజు అధికారికంగా ప్రకటించారు. ‘మా’ సభ్యుల సంక్షేమం కోసం నేను గతంలో అన్ని రకాల కృషి చేసానని, భవిష్యత్తులో కూడా కృషి చేస్తానని ఆయన చెప్పుకొచ్చారు.

సంబంధిత సమాచారం :