‘బాహుబలి’ సెట్లో ప్రతి గంట ఓ చాలెంజ్ – సబు సైరిల్

‘బాహుబలి’ సెట్లో ప్రతి గంట ఓ చాలెంజ్ – సబు సైరిల్

Published on Nov 6, 2014 11:46 AM IST

sub-sirel
తెలుగు చలన చరిత్ర చరిత్రలోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా ‘బాహుబలి’. ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా కోసం ఎంతో మంది ఇంటర్నేషనల్ టెక్నీషియన్స్ పనిచేయడమే కాకుండా, ఇండియాలో ది మోస్ట్ వాంటెడ్ టెక్నీషియన్స్ అయిన వారు కూడా పనిచేస్తున్నారు. అందులో ఇండియాలో బాగా ఫేమస్ అయిన ఆర్ట్ డైరెక్టర్ మరియు ప్రొడక్షన్ డిజైనర్ అయిన సబు సైరిల్ కూడా ఈ సినిమాకి పనిచేస్తున్నారు.

సబు సైరిల్ ‘బాహుబలి’ సినిమా గురించి మాట్లాడుతూ ‘బాహుబలి సెట్స్ లో ప్రతి ఒక్క గంట చాలెంజింగ్ గా ఉంది. పీరియాడికల్ ఫిలిం అంటే అదొక భాద్యత, అక్కడ తప్పులకు అస్సలు చోటు ఉండకూడదు. సినిమాలో కనిపించే ప్యాలెస్ లు, కత్తులు, కటార్లు, కుర్చీలు, సైన్యంలో వాడే వస్తువులు ఇలా ప్రతి ఒక్కటి మనమే మొదటి నుంచి డిజైన్ చేసుకొని తయారు చేసుకోవాలని’ అన్నాడు.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా మొదటి పార్ట్ ని 2015 ఏప్రిల్ లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.

తాజా వార్తలు