చిల్ బుల్ పాండే మొదలెట్టాడు !

Published on Apr 1, 2019 1:52 pm IST

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటించిన దబాంగ్, దబాంగ్ 2 చిత్రాలు భారీ విజయాలు సాధించాయి. ఇక తాజాగా ఏడు సంవత్సరాల తరువాత ఈ సిరీస్ కు కొనసాగింపుగా దబాంగ్ 3 అనే చిత్రం తెరకెక్కుతుంది. ఈ చిత్రం యొక్క ఈ రోజు ఇండోర్ లో స్టార్ట్ అయ్యింది. ప్రభుదేవా డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో సల్మాన్ తో పాటు అర్బాజ్ ఖాన్ , సోనాక్షి సిన్హా నటిస్తున్నారు. ఒక పోలీస్ ఆఫీసర్ నిజ జీవిత కథ తో తెరకెక్కుతున్న ఈచిత్రం ఈఏడాది క్రిస్మస్ కానుకగా ప్రేక్షుకులముందుకు రానుంది.

ఇక దబాంగ్ తెలుగులో గబ్బర్ సింగ్ గా రీమేక్ అయ్యి బ్లాక్ బ్లాస్టర్ విజయాన్ని సాధించింది. హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రంలో పవర్ సస్టార్ పవన్ కళ్యాణ్ నటించారు. మరి హరీష్ ఈ చిత్రానికి కూడా సీక్వెల్ ను ప్లాన్ చేస్తాడో లేదో చూడాలి.

సంబంధిత సమాచారం :