తెలుగు ప్రేక్షుకుల కోసం ‘సల్మాన్ ఖాన్’ ఈవెంట్ !

తెలుగు ప్రేక్షుకుల కోసం ‘సల్మాన్ ఖాన్’ ఈవెంట్ !

Published on Dec 13, 2019 10:45 PM IST

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ హీరోగా దబాంగ్ సీరీస్ లో మూడో సినిమా ‘దబాంగ్ 3’ డిసెంబర్ 20వ తేదీన హిందీతో పాటు తెలుగునాట కూడా భారీ ఎత్తున విడుదలకానుంది. అందుకే చిత్రబృందం తెలుగులో కూడా ప్రమోషన్స్ ను ప్లాన్ చేసింది. అందులో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సిద్ధమైంది. ఈ నెల 18న హైదరాబాద్ లోని జెఆర్సీ కన్వెన్షన్ హాల్ లో శ్రేయాస్ గ్రూప్ వారు భారీ స్థాయిలో మొదటిసారి ఈ బాలీవుడ్ ఈవెంట్ ను నిర్వహించనున్నారు.

కాగా ఈ సినిమాలో సల్మాన్ ఖాన్ సరసన సోనాక్షి సిన్హా హీరోయిన్ గా నటిస్తోంది. దర్శకుడు ప్రభుదేవా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఏపీ, తెలంగాణల్లోని ముఖ్యమైన అన్ని చోట్లా హిందీ, తెలుగు రెండు వెర్షన్లు విడుదలవుతాయి. సల్మాన్ ఖాన్ కు సాధారణంగానే హైదరాబాద్ లాంటి సిటీల్లో మల్టీప్లెక్స్ ఆడియన్స్ ఎక్కువ. తెలుగు వెర్షన్ కూడా ఉండటంతో అది మరింత పెరుగుతుంది. కాబట్టి సల్మాన్ చిత్రం నుండి బాలయ్య, సాయి తేజ్ సినిమాలకు గట్టి పోటీ ఎదురయ్యే అవకాశం లేకపోలేదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు