మన తెలుగు చలన చిత్ర పరిశ్రమలో మంచి కంటెంట్ మరియు బెస్ట్ క్వాలిటీ ఉన్న చిత్రాలను అందివ్వడంలో ప్రముఖ నిర్మాత సురేష్ ప్రొడక్షన్స్ అధినేత దగ్గుబాటి సురేష్‌బాబు ఎప్పుడూ ముందుంటారు. తెలుగు సినిమా పల్స్ ను ఎప్పటికప్పుడు అంచనా వేయగలిగే ఈ మాస్టర్ మైండ్ ప్రొడ్యూసర్ ఇప్పుడు రెండు ఆసక్తికర చిత్రాలను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు.
అది కూడా వారి రామానాయుడు ఫిలిం స్కూల్ లో ప్రావీణ్యం పొందిన సీనియర్ విద్యార్థులతో ప్లాన్ చేస్తున్నట్టుగా వెల్లడించారు. సతీష్ త్రిపుర మరియు గంగరాజు అనే ఇద్దరు దర్శకులతో ఒక క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ మరియు ఒక ప్రముఖ వ్యాపారవేత్త కు సంబంధించిన జీవిత చరిత్రపై ఈ సినిమాలను సురేష్ బాబు నిర్మించనున్నారు. ఈ సందర్భంలో సురేష్ బాబు మాట్లాడుతూ..
“మా ఫిలిం స్కూల్ విద్యార్థులను కొన్ని సంవత్సరాలుగా సినీరంగంలో చోటు చేస్కుంటున్న మార్పులకు, సవాళ్లకు, నూతన సాంకేతకతకు మరియు పోటీకి తగ్గట్టుగా మలచటంలో మేము సపలీకృతులమయ్యాము. సాధారణ విద్యాసంస్థలకు భిన్నంగా మేము మా విద్యార్ధులకు మంచి ఎక్స్ పీరెన్స్ ను అందిస్తున్నాము.” అని వారు తెలిపారు. అలాగే ఇదే సమయంలో హీరో మరియు రామానాయుడు స్టూడియోస్ అధినేత రానా దగ్గుబాటి మాట్లాడుతూ..
“ఇప్పుడు ఫిల్మ్ మేకింగ్ నిరంతరం అభివృద్ధి చెందుతుంది అని అలాగే డిజిటల్ రంగం రాకతో సరికొత్త మార్పులు వచ్చాయి, అందుకు తగ్గట్టుగానే సినీ రంగంలో తమ ప్రత్యేకతను దాటుకునేలా రామానాయుడు ఫిలింస్కూల్ విద్యార్ధులను తయారు చేస్తున్నాం అని తాము మున్ముందు తీయబోయే చిత్రాలు ఫిల్మ్ స్కూల్ విద్యార్ధి స్థాయి నుంచి చిత్ర నిర్మాణంలో పాలుపంచుకునేంత వరకు జరిగే ప్రక్రియని మేము మరింత సులభతరం చేసే విధంగా ఉంటాయని” రానా పేర్కొన్నారు.


