భరత్ అనే నేను వివాదం ఫై స్పంధించిన చిత్ర నిర్మాత !
Published on Jul 17, 2018 10:20 pm IST

సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ‘భరత్ అనే అనే నేను’ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంత పెద్ద విజయం సాధిచిందో అందరికి తెలిసిందే. కొరటాల శివ తెరకెక్కించిన ఈ చిత్రంలో మహేష్ సరసన కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది. ప్రముఖ నిర్మాత దానయ్య డి వి వి ఈ చిత్రాన్ని నిర్మించారు.

ఇక ఈ చిత్రంలో నటించిన కియారా కు అలాగే చిత్ర దర్శకుడు కొరటాల కు చిత్ర నిర్మాత దానయ్య పూర్తి గా రెమ్యూనరేషన్ ఇవ్వలేదని కొన్ని పత్రికల్లో వార్తలు వచ్చిన నేపథ్యంలో తాజాగా వీటిపై ఆయన స్పందిచారు. మా ప్రొడక్షన్ హౌస్ ఫై ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు రావడం చాలా బాధాకరం. కమిట్మెంట్స్ విషయంలో మా సంస్థకు చాలా మంచి పేరుంది అందుకు గర్వాంగా ఫీల్ అవుతున్న ఇక ఇంత మంచి చిత్రం లో నేను బాగస్వామ్యం అయినందుకు గర్వ పడుతున్నాను. ఈ చిత్రంలో నటించిన నటి నటులకు , సాంకేతిక నిపుణులకు వారికీ ఇవ్వాల్సిన వన్నీ ఇచ్చేసాం. వీటిపై ఇంకా ఏమైనా సందేహాలు కానీ ఉంటే హైదరాబాద్ లోని మా కార్యలయంలో సంప్రదిచవచ్చు లేకపోతే ఈసినిమాకు పనిచేసిన వారిని ఎవరినైనా కలుసుకొని మీ అనుమానాలను నివృత్తి చేసుకోగలరు. 25సంవత్సరాలుగా కష్టపడి ఈ స్థాయికి వచ్చాం. ఇలాంటి తప్పుడు కథనాలను నమ్మవల్సిన అవసరం లేదని ట్విట్టర్ ద్వారా తెలియజేశారు.

  •  
  •  
  •  
  •  

 
Subscribe to our Youtube Channel
 
Like us on Facebook